Abn logo
Jun 23 2021 @ 23:55PM

ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి

- ఐఏహెచ్‌వీ ఎన్‌జీవో సంస్థను అభినందించిన ఎమ్మెల్యే బీరంకొల్లాపూర్‌, జూన్‌ 23 : ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ హ్యుమన్‌ వాల్యుస్‌ (ఐఏహెచ్‌వీ) ఎన్‌జీవో సంస్థ కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వితరణ చేసింది. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వాటిని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు అంద జేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ హ్యుమన్‌ వాల్యుస్‌ సంస్థ ఇలాంటి సహాయం చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్లప్పుడు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ భరత్‌రావు, డా.జయచంద్ర, డా.ప్రశాంతి, ఫార్మాసిస్టు వెంకటేశ్‌,  పట్టణ మాజీ ఉప సర్పంచ్‌ చంద్రశేఖరా చారి, టీఆర్‌ఎస్‌ నాయకులు జాగుల బాలయ్య, శివానందం, కౌన్సిలర్లు కృష్ణమూర్తి, కర్నె వాసు, చాంద్‌పాషా, రాఘవేంద్ర, నిరంజన్‌, కాటం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.