నల్గొండ జిల్లాలో నేడు మరో నాలుగు పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-04T23:35:25+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఐరోపా ఖండాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారతదేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

నల్గొండ జిల్లాలో నేడు మరో నాలుగు పాజిటివ్ కేసులు

నల్గొండ: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఐరోపా ఖండాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారతదేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ వైరస్ తిష్టవేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లాలో శనివారం మరో నాలుగు పాజిటివ్ కేసులు


నమోదయ్యాయి. అందరూ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో పాజిటివ్ బాధితులు ఉన్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 14కు కరోనా కేసులు చేరాయి.


నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మండ్రలో హైస్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ స్కూల్‌లో విధులు నిర్వహించిన టీచర్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. టీచర్‌కు కరోనా రావడంతో ముందస్తుగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాద్యాయుడికి కరోనా తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపు జగిత్యాలలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్‌కు వెళ్లొచ్చిన ఇద్దరు కోరుట్ల వాసులకు పాజిటివ్‌గా నిర్ధారించారు. బాధితుల కుటుంబ సభ్యులను జేఎన్టీయూ ఐసోలేషన్‌కు అధికారులు తరలించారు. 






Updated Date - 2020-04-04T23:35:25+05:30 IST