Abn logo
Aug 1 2020 @ 02:41AM

మౌలికం నాలుగో నెలలోనూ కిందికే...

న్యూఢిల్లీ: భారత మౌలిక వసతుల రంగం కోలుకునే సూచనలు ఎక్కడా కనిపించడంలేదు. కొవిడ్‌-19 ప్రభావంతో తిరోగమనంలోకి ప్రవేశించిన ఈ రంగం వరుసగా నాలుగో నెల కూడా ప్రతికూల వృద్ధినే నమోదు చేసింది. బొగ్గు, క్రూడాయిల్‌, సహజ వాయువు, స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌ రంగాల్లో ఉత్పత్తి క్షీణించడంతో ఈ రంగం జూన్‌ నెలలో -15 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. గత ఏడాది జూన్‌లో ఇది 1.2 శాతం వృద్ధిలో ఉంది. కాగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కూడా -24.6 శాతం ప్రతికూల వృద్ధి నమోదయింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది కీలక రంగాలు 40.27 శాతం వాటా కలిగి ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement