terrorists : జమ్మూకాశ్మీర్‌లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-01T03:21:06+05:30 IST

కాశ్మీర్(Kashmir) వ్యాలీలో వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు లష్కరే తోయిబా(Lashkar-e-Taiba (LeT) ఉగ్రవాదులను భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

terrorists : జమ్మూకాశ్మీర్‌లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

జమ్ము : కాశ్మీర్(Kashmir) వ్యాలీలో వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు లష్కరే తోయిబా(Lashkar-e-Taiba (LeT) ఉగ్రవాదులను భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్ముకాశ్మీర్(Jammu and Kashmir) పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం భద్రతా బలగాలు మూడు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టాయి. గుర్తుతెలియని టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం ఆధారంగా హడిపురా, వాహథోర్ చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేశాయి. ఇక జులై 30న అలూసా వద్ద బలగాలు గాలింపు ఆపరేషన్ చేపట్టాయి.


హదిపూరా వద్ద తనిఖీ చేస్తుండగా ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, అమ్మోనియంను స్వాధీనం చేసుకున్నట్టు బలగాలు తెలిపాయి. 2 పిస్తోళ్లు, 2 మ్యాగజైన్లు, 11 రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నాయి. ఇక వాహథోర్ వద్ద తనిఖీల్లో 1 లష్కరే తోయిబా ఉగ్రవాది పట్టుబడగా.. అతడి వద్ద మూడు రౌండ్ల యూబీజీఎల్, 81 రౌండ్ల ఏకే-47 రైఫిల్ లభ్యమైంది. మరోవైపు అలూసా గాలింపు ఆపరేషన్‌లో ఒక లష్కరే తోయిబా ముష్కరుడు పట్టుబడగా అతడి నుంచి 1 పిస్తోల్, ఒక హ్యాండ్ గ్రెనేడ్ రికవరీ చేసినట్టు బలగాలు వివరించాయి.

Updated Date - 2022-08-01T03:21:06+05:30 IST