ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-09-07T12:50:38+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. మూణ్నెల్ల చిన్నారి, ఆమె తల్లి సహా నలుగురిని కాల్చి చంపాడు.

ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. మూణ్నెల్ల చిన్నారి, ఆమె తల్లి సహా నలుగురిని కాల్చి చంపాడు. ఈ ఘోరానికి పాల్పడింది మాజీ పోలీసు అధికారి కావడం గమనార్హం. బ్రియాన్‌ రిలే(33) మెరైన్‌ కార్ప్స్‌లో షార్ప్‌షూటర్‌గా పనిచేశాడు. అమెరికా దళాలతో కలిసి ఇరాక్‌, అఫ్ఘానిస్థాన్‌ల్లో విధులు నిర్వర్తించాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రిలే ఆదివారం జస్టిస్‌ గ్లీసన్‌(40), 33 ఏళ్ల మహిళ, ఆమె 3 నెలల పాప, అమ్మమ్మ(62)ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. వారి ఇంట్లోని పెంపుడు కుక్కను కూడా కాల్చేశాడన్నారు. 

Updated Date - 2021-09-07T12:50:38+05:30 IST