Colombia: బొగ్గుగనిలో పేలుడు..నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-25T12:48:47+05:30 IST

సెంట్రల్ కొలంబియా దేశంలోని టోపాగా పట్టణంలోని బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో నలుగురు దుర్మరణం చెందారు....

Colombia: బొగ్గుగనిలో పేలుడు..నలుగురి మృతి

ఏడుగురు గని కార్మికులకు గాయాలు

బగోటా(కొలంబియా): సెంట్రల్ కొలంబియా దేశంలోని టోపాగా పట్టణంలోని బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో నలుగురు దుర్మరణం చెందారు. బొగ్గుగని లోపల మిథేన్ గ్యాస్ పేలుడు వల్ల నలుగురు మరణించగా, మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.బొగ్గు గనిలో వెలువడిన మిథేన్ గ్యాస్ బొగ్గు డస్ట్ తో కలిసి పేలుడు సంభవించింది. కొలంబియాలో పేలుడు జరిగిన బొగ్గుగనిని నేషనల్ మైనింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. 


బొగ్గుగని ప్రమాదంలో గాయపడిన కార్మికుల కోసం గాలిస్తున్నారు. పేలుడు జరిగిన బొగ్గుగనిలోకి ఫ్యాన్ల ద్వారా ఆక్సిజన్ ను పంపిస్తున్నారు. టోపాగా మేయరు, పోలీసులు, రెడ్ క్రాస్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు. పేలుడు జరిగిన కార్బోనేరా బొగ్గుగనికి లైసెన్సు ఉందని కొలంబియా అధికారులు చెప్పారు.

Updated Date - 2021-08-25T12:48:47+05:30 IST