సాయినగర్‌లో నాలుగు ఇళ్లల్లో దొంగతనాలు

ABN , First Publish Date - 2021-02-25T04:32:43+05:30 IST

తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడే ఓ ముఠా మరోసారి తన ప్రతాపం చూపింది.

సాయినగర్‌లో నాలుగు ఇళ్లల్లో  దొంగతనాలు
పోలీసు జాగిలంతో దర్యాప్తు చేస్తున్న సీఐ, ఎస్‌ఐ

15 సవర్ల బంగారం, రూ. 55వేల నగదు అపహరణ 

కందుకూరు, ఫిబ్రవరి 24: తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడే ఓ ముఠా మరోసారి తన ప్రతాపం చూపింది. కందుకూరు పట్టణ ంలోని సాయినగర్‌లో తలుపులకు తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లలో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడి 15 సవర్ల బంగారం, రూ. 55వేల నగదు అపహరించుకుపోయారు. వీరంతా ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లగా దొంగలు తమ చేతివాటం చూయించారు. వెంకటస్వామి, నారాయణ  అనేవారితో పాటు వారి పొరుగునే ఉండే మరో ఇద్దరు ఇళ్లలో దొంగలు పడగా ఒక ఇంట్లో 10 సవర్ల బంగారం 20 వేలు, మరో ఇంట్లో 5 సవర్లు 20 వేలు, ఒక ఇంట్లో 15వేల నగదు దొరగ్గా అపహరించుకుపోయారు. నాల్గవ ఇంటిలో ఏమీ దొరకలేదు. బుధవారం ఉదయం తిరిగి వచ్చిన వీరు ఇళ్లలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ఈ దొంగతనాలు సోమవారం రాత్రి జరిగినట్లు నిర్థారించిన పోలీసులు జాగిలాలను రప్పించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఈ తరహా దొంగతనాలు వరుసగా జరిగేవని, ఇటీవలి కాలంలో లేనప్పటికీ మళ్లీ ప్రారంభం కావటంతో పట్టణ ంలో ఓ దొంగల ముఠా తిష్ఠ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.  దొంగతనాలను త్వరలో ఛేదిస్తామని సీఐ విజయకుమార్‌, పట్టణ ఎస్‌ఐ తిరుపతిరావు తెలిపారు.


Updated Date - 2021-02-25T04:32:43+05:30 IST