చేపల వేటకు వెళ్లి ఆరుగురు మత్య్సకారులు గల్లంతు

ABN , First Publish Date - 2020-04-10T07:00:53+05:30 IST

ఏటిపాయాల్లో చేపలు పట్టుకొనేందుకు పడవల్లో వెళ్లిన మత్య్సకారులు అకాల వడగండ్ల వర్షం ధాటికి గల్లంతయ్యాయరు. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ పల్లిపాలేనికి చెందిన 15మంది మత్య్సకారులు...

చేపల వేటకు వెళ్లి ఆరుగురు మత్య్సకారులు గల్లంతు

  • నాలుగు మృతదేహాలు లభ్యం
  • మరో ఇద్దరి కోసం గాలింపు 

కృత్తివెన్ను, ఏప్రిల్‌ 9: ఏటిపాయాల్లో చేపలు పట్టుకొనేందుకు పడవల్లో వెళ్లిన మత్య్సకారులు అకాల వడగండ్ల వర్షం ధాటికి గల్లంతయ్యాయరు. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ పల్లిపాలేనికి చెందిన 15మంది మత్య్సకారులు, ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన మరో ఐదుగురు మత్య్సకారులు వారి గ్రామాలకు సమీపల్లోనున్న పాయల్లో వలకట్ల చేపల వేటకు బుధవారం రాత్రి వెళ్లారు. వేట ముగించుకొని తెల్లవారుజామున తిరిగి బయల్దేరారు. ఈదురుగాలులు, వర్షంతో పాయలు పొంగి, పడవలన్నీ నీటమునిగాయి. గుడిదిబ్బ పల్లిపాలెం గ్రామానికి చెందిన 12మంది తీరానికి చేరుకోగా, ముగ్గురు గల్లంతయ్యారు.


ఒర్లగొందితిప్పలో ఐదుగురూ గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ఒర్లగొందితిప్పకు చెందిన జల్లా ఏసురాజు, జల్లా ముత్యాలును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జల్లా పెద్దిరాజులు(60), జల్లా వెంకటేశ్వరరావు(52) మృతదేహాలు ఇంతేరు వద్ద ఒడ్డుకు చేరాయి. జల్లా దావీదు(22)కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా ఒక కుటుంబానికి చెందినవారు. గుడిదిబ్బ పల్లిపాలెంలో గల్లంతైన వనమాలి వెంకటేశ్వరరావు(61), మోకా నాగేశ్వరరావు(62) మృతదేహాలు లభ్యం కాగా, బలగం నరసింహమూర్తి కోసం గాలిస్తున్నారు. మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం తరఫున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


Updated Date - 2020-04-10T07:00:53+05:30 IST