ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో దారుణ నిజాలు.. ఆ భార్యాభర్తల కడుపులో..

ABN , First Publish Date - 2021-10-04T21:26:02+05:30 IST

ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో బయటపడిన ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టించింది. మృతదేహాలను ఆసుపత్రికి తరలించిగా పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు వి

ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో దారుణ నిజాలు.. ఆ భార్యాభర్తల కడుపులో..

ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో బయటపడిన ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టించింది. మృతదేహాలను ఆసుపత్రికి తరలించిగా పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. ఆ భార్యభర్తల కడుపులోంచి బయటపడ్డ వాటిని గురించి విని.. అసలేం జరిగి ఉంటుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


జోధ్‌పూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగు మృతదేహాలు ఉన్నట్లుకు అక్టోబర్ 1న పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చనిపోయింది.. దుస్తుల వ్యాపారి దీన్‌దయాల్ అరోరా, అతడి కుటుంబ సభ్యులని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లు కీలక విషయాలను వెల్లడించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే వారు చనిపోయినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా దీన్‌దయాల్ అరోరా, అతడి భార్య కడుపులో నిద్రమాత్రలను గుర్తించినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే.. వారి కూతుళ్ల శరీరాల్లో నుంచి మాత్రం నిద్రమాత్రలు బయటపడలేదని పేర్కొన్నారు. 



ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ నలుగురు మృతి చెందడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. దీన్‌దయాల్, అతడి భార్య సరోజ్.. ఇద్దరూ ముందుగా ప్లాన్ చేసే వారి కూతుళ్లను హత్యచేసి, ఆ తర్వాత వాళ్లూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా లేక ముగ్గురు కుటుంబ సభ్యులను దీన్‌దయాలే హత్య చేసి, అనంతరం అతడు ప్రాణాలు తీసుకుని ఉంటాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దీన్‌దయాల్, అతడి భార్య ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలో వారి మృతికి సంబంధించిన సమాచారం ఏదైనా దొరుకుందేమో అని భావిస్తున్నారు. కాల్‌రికార్డులను సైతం పరిశీలిస్తే ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచార లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. 


Updated Date - 2021-10-04T21:26:02+05:30 IST