Abn logo
Nov 21 2020 @ 05:45AM

కల్తీ మద్యం తాగి నలుగురి మృతి

ప్రయాగరాజ్ (యూపీ): కల్తీ మద్యం తాగి నలుగురు మరణించిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమీలియా గ్రామంలో వెలుగుచూసింది.ప్రయాగరాజ్ జిల్లా ఫూల్పూరు పోలీసుస్టేషను పరిధిలోని అమీలియా వద్ద కల్తీ మద్యం తాగి నలుగురు మరణించారని, మరో ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చామని ప్రయాగరాజ్ జిల్లా భానుచంద్ర గోస్వామి చెప్పారు. కల్తీ మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు. మృతులను పోస్టుమార్టం కోసం తరలించారు. కల్తీ మద్యం విక్రేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మెజిస్ట్రేట్ భానుచంద్ర చెప్పారు. కల్తీ మద్యం విక్రయించిన అమీలియా గ్రామానికి అధికారులు హుటాహుటిన వచ్చి తనిఖీలు చేశారు.