రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం

ABN , First Publish Date - 2022-07-12T14:14:34+05:30 IST

రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల వేగంలో మార్పులు

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం

అడయార్‌(చెన్నై), జూలై 11: రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల వేగంలో మార్పులు సంభవించడంతో చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ కారణంగా చలిగాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిసినట్టు తెలిపింది. మంగళవారం కన్నియాకుమారి, తిరునెల్వేలి, వెస్ట్రన్‌ఘాట్స్‌ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో, డెల్టా జిల్లాలతో పాటు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, బుధ, గురువారాల్లో కన్నియాకుమారి, నెల్లై, పశ్చిమ కనుమల జిల్లాల్లోని ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా నీలగిరి జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. 

Updated Date - 2022-07-12T14:14:34+05:30 IST