మునిగిపోతున్న పడవలో నాలుగు పిల్లులు.. కాపాడిన నేవీ అధికారి

ABN , First Publish Date - 2021-03-04T17:57:47+05:30 IST

థాయ్‌ల్యాండ్‌కు చెందిన థాట్సాఫాన్ సాయ్(23) అనే నావీ అధికారి ప్రాణాలకు తెగించి మునిగిపోతున్న

మునిగిపోతున్న పడవలో నాలుగు పిల్లులు.. కాపాడిన నేవీ అధికారి

బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్‌కు చెందిన థాట్సాఫాన్ సాయ్(23) అనే నేవీ అధికారి ప్రాణాలకు తెగించి మునిగిపోతున్న పడవలో చిక్కుకున్న నాలుగు పిల్లులను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కో అడాంగ్ ద్వీపం సమీపంలో ఆయిల్ ట్యాంక్‌లతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో ప్రమాదానికై గురైంది. ఒకపక్క పడవ మునిగిపోతుండటం.. మరోపక్క ఆయిల్ ట్యాంక్ లీక్ అవుతుండటంతో సిబ్బంది వెంటనే విషయాన్ని నావికా దళానికి చేరవేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న నేవీ అధికారులు పడవలో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బందిని కాపాడారు. 


ఇదే సమయంలో విచిత్ పుక్డీలాన్ అనే నేవీ అధికారి తన కెమెరా ద్వారా పడవలో నాలుగు పిల్లులు చిక్కుకున్నట్టు గుర్తించారు. వెంటనే థాట్సాఫాన్ సాయ్ పిల్లులు చిక్కుకున్న చోటుకు వెళ్లి వాటిని తన భుజాలపై పెట్టుకుని వాటి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనుషులతో పాటు పిల్లులకు సమానమైన గౌరవం ఇచ్చి వాటి ప్రాణాలు కాపాడిన థాట్సాఫాన్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2021-03-04T17:57:47+05:30 IST