నాలుగు ఎకరాల జీడితోట దగ్ధం

ABN , First Publish Date - 2021-03-04T05:28:05+05:30 IST

మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు వెల్దాం రెవెన్యూలో సుమారు నాలుగు ఎకరాల జీడితోట దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాలుగు ఎకరాల జీడితోట దగ్ధం
కాలిపోయిన జీడితోట

వేపాడ, మార్చి 3 : మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు వెల్దాం రెవెన్యూలో సుమారు నాలుగు ఎకరాల జీడితోట దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు ఏడువాక అప్పారావు రెవెన్యూ పరిధి లోని 88, 89, 90 సర్వే నెంబర్లలోని సుమారు 4 ఎకరాల మెట్ట భూమిలో జీడితోటను సాగుచేస్తున్నాడు. పిక్క దశకు చేరుకోవ డంతో రోజూలాగే మంగళవారం కూడా ఉదయాన్నే తోటకు వెళ్లి సాయంత్రం వరకూ తోటలోనే ఉన్నాడు. అయితే బుధవారం ఉదయాన్ని వెళ్లి చూడగా మొత్తం నాలుగు ఎకరాల్లోని జీడితోట పూర్తిగా దగ్ధమై కనిపించడంతో లబోదిబోమంటున్నాడు. ప్రమా దం ఎలా జరిగిందో తెలియరాకపోయినా తోటలోని పాక కూడా పూర్తిగా కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోట అగ్నికి ఆహుతవడంతో తీవ్రంగా నష్టపోయానంటూ గోల్లుమంటు న్నాడు. ఉద్యానశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి విచారిస్తున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.


రావుపల్లిలో గడ్డి వాములు

గరుగుబిల్లి : రావుపల్లిలో బుధవా రం సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు 12 గడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద వశాత్తు జరిగిన ఈ సంఘ టనలో మర్రాపు చిన్నంనాయుడు, ఎం.శ్రీరామ్మూర్తి, బోను వెంకటనాయుడు, పి.నాగభూషణ రావు, బి.పెద్దినాయుడు, ఎన్‌.శివున్నాయుడు, బి.సుదర్శనరావుకు చెందిన 50 ఎకరాల వరిపంటకు చెందిన గడ్డి వాములు కాలిబూడిదయ్యాయి. గ్రామ పరిధిలో మూడుసార్లు ఇలాంటి సంఘటనలు నెలకొనడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డి వాములు దగ్ధం కావడంతో మూగ జీవాలకు ఆహార కొర త నెలకొందన్నారు. ప్రమాద సంఘటనను పార్వతీపురం అగ్నిమాపక సిబ్బందికి సర్పంచ్‌ బి.మహేష్‌, వీఆర్‌వో యు.రాంబాబు సమాచారం అందించడంలో హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 


Updated Date - 2021-03-04T05:28:05+05:30 IST