మందిరానికి పునాది వేసింది రాజీవ్ గాంధీనే: దిగ్విజయ్

ABN , First Publish Date - 2020-08-03T20:18:06+05:30 IST

రామమందిర నిర్మాణం చేపట్టకుండా కాంగ్రెస్ తాత్సారం చేసిందని అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అయోధ్యను సందర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్.. మందిర నిర్మాణం చేపట్టాలని రాజీవ్ గాంధీ

మందిరానికి పునాది వేసింది రాజీవ్ గాంధీనే: దిగ్విజయ్

న్యూఢిల్లీ: రామ మందిర నిర్మాణానానికి పునాది రాయి వేసింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీనేనని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోమవారం ఆయన మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.


రామమందిర నిర్మాణం చేపట్టకుండా కాంగ్రెస్ తాత్సారం చేసిందని అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అయోధ్యను సందర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్.. మందిర నిర్మాణం చేపట్టాలని రాజీవ్ గాంధీ కోరుకున్నారని అన్నారు.


ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్‌ను విలేకర్లు ప్రశ్నించగా ‘‘రాజీవ్ గాంధీ కోరుకోవడమే కాదు, మందిర నిర్మాణానికి తొలి పునాది రాయి వేసింది ఆయనే’’ అని అన్నారు.

Updated Date - 2020-08-03T20:18:06+05:30 IST