ప్రాణం తీసిన ఫార్వార్డ్ మెసేజ్!

ABN , First Publish Date - 2021-05-15T21:12:40+05:30 IST

ఓ ఫార్వార్డ్ మెసేజ్ ప్రాణాన్ని తీసేసింది. ఎవరో పంపిన మెసేజును తెలిసిన వారికి ఫార్వార్డ్ చేయగా... చివరికి అతని ప్రాణాలే పోయాయి.

ప్రాణం తీసిన ఫార్వార్డ్ మెసేజ్!

ఓ ఫార్వార్డ్ మెసేజ్ ప్రాణాన్ని తీసేసింది. ఎవరో పంపిన మెసేజును తెలిసిన వారికి ఫార్వార్డ్ చేయగా... చివరికి అతని ప్రాణాలే పోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఉన్న నారాయణపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివారల ప్రకారం... స్థానికంగా నివసించే జి.శ్రీనివాస్(38) ఆక్వా కంపెనీలో పని చేస్తుంటాడు. అతనికి ఈ మధ్య కాలంలో కోళ్లకు కరోనా అనే మెసేజు వచ్చింది. ఆ మెసేజును ఇతర గ్రూపులలోకి ఫార్వార్డ్ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అతనికి కాల్ చేశారు. ఓ సారి విచారణకు కూడా పిలిచారు. ఆ మెసేజుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా వారు వినలేదు. దీంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్ మంచానపడ్డాడు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అతన్ని హాస్పిటల్‌కు తరలించగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోలీసుల వేధింపులతోనే తన భర్త మరణించాడని మృతుడి భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు.  

Updated Date - 2021-05-15T21:12:40+05:30 IST