అభివృద్ధిలో ముందుకు

ABN , First Publish Date - 2020-06-02T10:51:29+05:30 IST

రాష్ట్రం ఏ ర్పడ్డాక ప్రభుత్వం కొత్త జిల్లాలు మండలాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైంది. కొత్త

అభివృద్ధిలో ముందుకు

ఆరేళ్లలో ప్రజలకు చేరువైన పాలన

అన్నదాతలకు వెన్ను దన్నుగా పథకాలు

లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల్లు

కామారెడ్డి జిల్లాగా ఏర్పడి నాలుగేళ్లు

చివరిదశలో కలెక్టరేట్‌, ఎస్పీ భవనాలు 


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి), జూన్‌ 1: రాష్ట్రం ఏ ర్పడ్డాక ప్రభుత్వం కొత్త జిల్లాలు మండలాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైంది. కొత్త కలెక్టరేట్‌, ఎస్పీ భవనాల నిర్మా ణాలు చివరదశకు చేరాయి. బాన్సువాడ డివిజన్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులు పూర్తి కావడంతో లబ్ధిదారులకు కేటాయించారు. కామా రెడ్డి డివిజన్‌లో మరో 1500 డబుల్‌ బెడ్‌రూం ఇ ళ్లు సిద్ధంగా ఉన్నాయి. మిషన్‌భగీరథ పథకం ప నులు పూర్తయి గ్రామ గ్రామానా తాగునీరు సర ఫరా అవుతుండడం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రహదారులను సుందరీకరణంగా తీర్చి దిద్దారు. వీటితో పాటు జుక్కల్‌ నియోజకవర్గానికి సాగు, తాగునీటి కష్టాలు లేకుండా ఉండేందుకు నాగ మడుగు ఎత్తిపోతల పథకం మంజూరు కావడం, మంజీర నదిపై బాన్సువాడ, బీర్కూర్‌లో చెక్‌డ్యాం ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 


విజయవంతంగా మిషన్‌ భగీరథ...

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటిం టికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఇప్ప టికే 834 నివాసపు ప్రాంతాలకు గాను 479 నివా సపు ప్రాంతాల్లో వందశాతం పనులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటి సరఫరా చేస్తున్నారు. రూ .2,650 కోట్లతో ఎస్‌ఆర్‌ఎస్పీ, సింగూర్‌ ప్రాజెక్ట్‌ల ద్వారా 834 అవాసల్లో తాగునీరు సర ఫరాకు అవసరమైన వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణం, పంప్‌ హౌజ్‌లు, ఫిల్టర్‌బెడ్‌ల నిర్మాణం పూర్తి చేశారు.


అన్నదాతలకు రైతుబంధు, బీమా...

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా రైతులకు విత్తనా లు, ఎరువులు కొనుగోళ్ల కోసం పెట్టుబడి సహా యం కింద రైతుబంధు పథకం పేరిట ఏడాదికి ఎకరానా రూ.10వేలను అందజేస్తోంది. ఇప్పటికే గత వానాకాలం, యాసంగిలో పెట్టుబడి సహా యం రైతులకు అందడంతో ఆ నగదు ఆసరా అ యింది. ఇప్పుడు వానాకాలంలో రూ.200  కోట్లు పెట్టుబడి సహాయం రైతులకు అందజేయనున్నా రు.  ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 2.33 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుంది. రూ.5 లక్షల రైతుల బీమా కింద జిల్లాలో మ రణించిన 260 మంది రైతు కుటుంబాలకు రూ. 13 కోట్లు, బ్యాం క్‌ ఖాతాలో జమ చేశారు. అదేవి ధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కేటాయిస్తూ ప్రభు త్వం కొనుగోలు చేస్తోంది. రబీ సీజన్‌లో జిల్లాలో 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల రూ.569 కోట్ల విలువ చేసే వరిధాన్యాన్ని 77,500 మంది రైతులనుంచి కొనుగోలు చేశారు. వరితో పాటు మొక్కజొన్న, కం దులు, శనగ పంటలను కొనుగోలు చేస్తున్నారు.


తుది దశకు కలెక్టరేట్‌, ఎస్పీ భవనాలు

జిల్లా కేంద్రానికి అవసరమైన కలెక్టరేట్‌ కాం ప్లెక్స్‌ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతు న్నాయన్నారు. రూ.51 కోట్లతో కలెక్టరేట్‌ భవన నిర్మాణం పనులు కొనసాగుతుండగా, కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం చివరి దశకు చేరాయి. గత ఏడాది సరిగా ఇదే సమయానికి కలెక్టర్‌, అదన పు కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ప్రారంభించ గా వీరు ఇక్కడి నుంచే జిల్లా పాలన కొనసా గిస్తున్నారు. రూ.15 కోట్లతో తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా వైట్‌హౌస్‌ను తలి పించేలా జిల్లా పోలీస్‌ కార్యాలయం నిర్మాణ ప నులు దాదాపు పూర్తయ్యాయి. జిల్లా రోడ్డు భవ నాల, పంచాయతీరాజ్‌శాఖల ద్వారా పలు పట్ట ణాల్లో మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, బీటీ, సీసీ రోడ్డులు నిర్మాణాలు చేపట్టారు.


కామారెడ్డిలో ప్రారంభానికి  సిద్ధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

జిల్లాలో బాన్సువాడతో పాటు కామారెడ్డి డి విజన్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు చేరువవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రెం డు వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయాయి. రూ. 449.12 కోట్లతో 7,176 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు కాగా ఇందులో 583 ఇళ్లు పూ ర్తయ్యాయి. 1,696 గృహాల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా 2,878 గృహ నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి.


Updated Date - 2020-06-02T10:51:29+05:30 IST