Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 8 2021 @ 08:05AM

Indonesia: జైలులో అగ్నిప్రమాదం: 41 మంది మృతి

జకార్తా (ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలోని బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఈ అగ్నిప్రమాదంలో 41 మంది ఖైదీలు మరణించగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో డ్రగ్ కేసుల్లో ఖైదీలున్నారని జైలు అధికారులు చెప్పారు. టంజిరంగ్ జైలు సీ బ్లాకులో మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన జైలులో 2వేల మందికి పైగా ఖైదీలున్నారు. అగ్నిప్రమాదం అనంతరం సహాయ చర్యల కోసం వందలాదిమంది పోలీసులు, సైనికులను రంగంలోకి దించారు.

మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను రప్పించారు.బాంటెన్ ప్రావిన్సు జైలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రింటి చెప్పారు. జైలులో మంటలు అంటుకోవడంతో సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. 

Advertisement
Advertisement