Abn logo
Sep 18 2021 @ 09:11AM

Japan: చంతూ తుపాన్ ఎఫెక్ట్..49 విమాన సర్వీసుల రద్దు

టోక్యో (జపాన్) : ‘చంతు’ తుపాను జపాన్‌ అతలాకుతలం చేసింది. ఈ తుపాన్ వల్ల ఐదుగురు గాయపడ్డారు. జపాన్ దేశంలో చంతు టైపూన్ వల్ల భారీవర్షాలు కురుస్తుండటంతో ముందుజాగ్రత్తగా 49 విమాన సర్వీసులను రద్దు చేశామని జపాన్ విమానయాన శాఖ అధికారులు శనివారం తెలిపారు.జపాన్ నైరుతి ప్రాంతాలైన షికోకు, క్యుషు ద్వీపాలకు విమాన సర్వీసులను రద్దు చేశారు.తుపాను కారణంగా నాగసాకి, ఫుకుయోకా,సాగా ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల ప్రజలు గాయపడ్డారు.చంతు తుపాన్ జపాన్ యొక్క పసిఫిక్ తీరం మధ్య భాగంలో తూర్పు వైపునకు పయనిస్తుందని జపాన్ అధికారులు చెప్పారు. తుపాన్ వల్ల గంటకు 67 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.దీంతో విమాన సర్వీసులను రద్దు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption