బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత హామిల్టన్‌

ABN , First Publish Date - 2020-08-03T09:01:14+05:30 IST

ఫార్ములా వన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి సత్తాచాటాడు. ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ రికార్డుస్థాయిలో ఏడోసారి బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ రేసులో చాంపియన్‌గా ...

బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత హామిల్టన్‌

సిల్వర్‌స్టోన్‌ (యూకే): ఫార్ములా వన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి సత్తాచాటాడు. ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ రికార్డుస్థాయిలో ఏడోసారి బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ రేసులో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఫైనల్‌ రేసులో హామిల్టన్‌ కారు ఆఖరి ల్యాప్‌లో పంక్చర్‌ కావడంతో కొంత ఉత్కంఠ రేగినా.. నెమ్మదిగా గెలుపు గీత దాటాడు. 52 ల్యాప్‌లను గంటా 28 నిమిషాల 1.283 సెకన్లలో రేసును ముగించి ప్రథమస్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెస్టాపెన్‌, ఫెరారీకి చెందిన చార్లెస్‌ లెక్లెర్క్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి పోడియం ఫినిష్‌ చేశారు. కెరీర్‌లో ఓవరాల్‌గా 87వ టైటిల్‌ సాధించిన హామిల్టన్‌.. ఎఫ్‌1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ అత్యధిక టైటిళ్ల రికార్డుకు కేవలం నాలుగు విజయాల దూరంలో నిలిచాడు.  

Updated Date - 2020-08-03T09:01:14+05:30 IST