ఫార్ములా వన్‌ కారు నడిపినట్టుగా!

ABN , First Publish Date - 2021-09-18T05:32:04+05:30 IST

రోలర్‌ కోస్టర్‌ ఎక్కితే బోల్డంత థ్రిల్‌. ఎగ్జిబిషన్లలో, అమ్యూజింగ్‌ పార్క్‌లలో చాలాసార్లు రోలర్‌ కోస్టర్‌ ఎక్కే ఉంటారు. కానీ అబూదబీలోని రోలర్‌ కోస్టర్‌ ఎక్కితే మాత్రం గుండె జారినంత పనవుతుంది...

ఫార్ములా వన్‌ కారు నడిపినట్టుగా!

రోలర్‌ కోస్టర్‌ ఎక్కితే బోల్డంత థ్రిల్‌. ఎగ్జిబిషన్లలో, అమ్యూజింగ్‌ పార్క్‌లలో చాలాసార్లు రోలర్‌ కోస్టర్‌ ఎక్కే ఉంటారు. కానీ అబూదబీలోని రోలర్‌ కోస్టర్‌ ఎక్కితే మాత్రం గుండె జారినంత పనవుతుంది. అంతేకాదు ఇది ఎక్కాలంటే మీరు తప్పక గాగుల్స్‌ ధరించాలి. ఎందుకంటే దాని వేగం అలాంటిది మరి! ఫార్ములా వన్‌ కారు నడిపే వ్యక్తి అనుభవం ఎలా ఉంటుందో.. ఈ రోలర్‌ కోస్టర్‌ ఎక్కితే అలాంటి అనుభవం సొంతమవుతుంది. ఫార్ములా వన్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే దీన్ని డిజైన్‌ చేశారు. ఎఫ్‌1 సూపర్‌ కార్‌లానే ఉంటుంది. కేవలం 4.9 సెకన్లలో 240కి.మీ వేగాన్ని చేరుకునే సామర్థ్యం దీనికుంది. కేవలం రెండు సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగంలో కీటకాలు, ఇసుక రేణువులు పడితే చూపు కోల్పోయే ప్రమాదముంది. అందుకే గాగుల్స్‌ ధరించాలని నిబంధన పెట్టారు. ఒకేసారి పదహారు మంది కూర్చునే వీలున్న ఈ రోలర్‌ కోస్టర్‌కు ప్రపంచంలోనే సూపర్‌ఫాస్ట్‌ రోలర్‌ కోస్టర్‌ అని పేరుంది.


Updated Date - 2021-09-18T05:32:04+05:30 IST