ఆధార్‌ అనుసంధానానికి ఫారాలు సిద్ధం

ABN , First Publish Date - 2022-08-09T07:06:32+05:30 IST

ఆధార్‌ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల సంఘం 15 లక్షల సిక్స్‌ బి ఫారాలను ముద్రించి జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు అందించేందుకు చర్యలు చేపట్టింది.

ఆధార్‌ అనుసంధానానికి ఫారాలు సిద్ధం
మండలాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్న ఫారాలు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 8: ఆధార్‌ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల సంఘం 15 లక్షల సిక్స్‌ బి ఫారాలను ముద్రించి జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీనియోజకవర్గాల  పరిధిలో 14.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరివద్దకు బూత్‌లెవల్‌ ఆఫీసర్లు వెళ్లి జాబితాలో ఉన్న ఓటరు నుంచి వారి ఆధార్‌ కార్డు వివరాలను నమోదు చేసే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన సిక్స్‌ బి ఫారాలను కలెక్టరేట్‌ నుంచి మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆయా తహసీల్దార్ల పర్యవేక్షణలో ఎన్నికల డీటీలు వీటిని బీఎల్‌వోలకు అందిస్తారు. అనుసంధాన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది.


Updated Date - 2022-08-09T07:06:32+05:30 IST