‘రైతు ప్రకాశం’ ద్వారా అవగాహన కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-12-05T05:39:48+05:30 IST

సాగులో మెలకువలు, సస్యరక్షణకు తీసుకోవాల్సిన జా గ్రత్తలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పో లా భాస్కర్‌ ఆదేశించారు.

‘రైతు ప్రకాశం’ ద్వారా అవగాహన కార్యక్రమాలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌


కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 4 : సాగులో మెలకువలు, సస్యరక్షణకు తీసుకోవాల్సిన జా గ్రత్తలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పో లా భాస్కర్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలె క్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన మాట్లాడు తూ రైతు ప్రకాశం పేరుతో రూపొందించనున్న వెబ్‌సైట్‌ ద్వారా రైతులకు అవసరమైన సమాచా రాన్ని అందించాలన్నారు. పంటల వారీగా తీసు కోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆడియో, వీడియో రూపంలో రైతుల సందేహాలను నివృత్తి చేయాల ని చెప్పారు. జిల్లా స్థాయిలో రిసోర్స్‌సెంటర్‌ ఏ ర్పాటు చేసే బ్రాడ్కాస్టింగ్‌ ఫెసిలిటి సెంటర్‌ నుం చి రైతు భరోసా కేంద్రాల్లోని రైతులకు సమాచా రం చేరేలా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయి లో సస్యరక్షణ కార్యక్రమాలను రూపొందించేందు కు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఓబీవ్యాన్‌ కూడా అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా కేం ద్రంలో బ్రాడ్కాస్టింగ్‌ సెంటర్‌తో పాటు దర్శిలో నూ శాటిలైట్‌ బ్రాడ్కాస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ వెంకటమురళీ, జేడీఏ శ్రీరా మమూర్తి, డీడీ షేక్‌ అబ్దుల్‌సత్తార్‌, జేడీ రవీంద్ర నాఽథ్‌ఠాగూర్‌, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, మత్య్సశాఖ జేడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యానవన శా ఖ ఏడీ నాగరాజు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఉపేం ద్ర తదితరులు పాల్గొన్నారు. 


ఈ-హాస్పిటల్‌పై సమీక్ష


ఒంగోలు (కార్పొరేషన్‌): రిమ్స్‌లో ప్రవేశ పెట్టిన ఈ-హాస్పిటల్‌ విధానాన్ని సమర్ధవంతం గా వినియోగించుకోవాలని కలెక్టర్‌ పోలా భా స్కర్‌ ఆదేశించారు. శుక్రవారం రిమ్స్‌ సమావేశం మందిరంలో వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిమ్స్‌లో ఈ-హా స్పిటల్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రోగులకు మెరుగైన సేవలు అం దించడంతో పాటు ఆసుపత్రిలో లోటుపాట్లు స వరించుకోవాలని సూచించారు. ఓపీలు, ఐపీ సే వలు, లేబొరేటరీ రిపోర్టులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ సేవలన్నీ ఆన్‌లైన్‌ చేయాలని, దీనివల్ల రోగి ఆరోగ్య స్థితిగతులు తక్షణమే తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హౌస్‌సర్జన్‌లకు కొన్ని నెలలుగా పెండింగ్‌ ఉన్న గౌరవ వేతనం వెంట నే చెల్లించాలని సూపరింటెండెంట్‌ శ్రీరాములకు ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజమన్నార్‌, డిప్యూటీ సూప రింటెండెంట్‌ మురళీకృష్ణరెడ్డి, మను మీడియా వ ర్క్స్‌ ప్రతినిధి పరమశివరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T05:39:48+05:30 IST