వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే..

ABN , First Publish Date - 2020-12-05T06:01:26+05:30 IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే..
శిబిరంలో మాట్లాడుతున్న కోటేశ్వరరావు

సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు


అనకాపల్లి టౌన్‌, నవంబరు 4: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. నెహ్రూచౌక్‌లో రైతుల రిలే దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చర్చల పేరుతో రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి, గురువారం రైతు సంఘాల నాయకులు దీటుగా సమాధానం ఇచ్చారని చెప్పారు. తద్వారా రైతుల ఐక్యతను మోదీ ప్రభుత్వానికి చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు పీఎస్‌ అజయ్‌కుమార్‌, ఎ.బాలకృష్ణ, వైఎన్‌ భద్రం, ఎగ్గాడ భాస్కరరావు, కోన లక్ష్మణ, కె.శంకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T06:01:26+05:30 IST