నాడు Gun పట్టిన గడ్చిరోలి మాజీ మహిళా నక్సల్స్ నేడు..

ABN , First Publish Date - 2021-11-23T01:19:04+05:30 IST

వ్యాపారంలో ట్రైనింగ్ తీసుకున్న 11 మంది మాజీ నక్సలైట్లు పినాయల్ తయారు చేస్తున్నారు. ‘క్లీన్ 101’ అనే పేరుతో దీన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీరికి ప్రోత్సాహక అమ్మకాలు కూడా వస్తున్నాయి. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన డాక్టర్..

నాడు Gun పట్టిన గడ్చిరోలి మాజీ మహిళా నక్సల్స్ నేడు..

నాగ్‌పూర్: గన్నులు పట్టిన ఆ చేతులతో ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. భారీ ఎన్‌కౌంటర్‌తో దేశాన్ని ఒక్కసారిగా తనవైపు చూసేలా తిప్పుకున్న గడ్చిరోలి ప్రాంతంలో ఆవిష్కృతమవుతున్న వాస్తవం ఇది. పది మంది మహిళలు, ఒక పురుషుడు.. మొత్తం 11 మంది మాజీ మావోలు ఇప్పుడు పోలీసుల సహకారంతో సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరికి ముందుగా వ్యాపారంలో ట్రెయినింగ్ ఇచ్చి వ్యాపార ప్రోత్సహకాలు అందిస్తున్నట్లు గడ్చిరోలి పోలీసులు తెలిపారు.


వ్యాపారంలో ట్రైనింగ్ తీసుకున్న 11 మంది మాజీ నక్సలైట్లు పినాయల్ తయారు చేస్తున్నారు. ‘క్లీన్ 101’ అనే పేరుతో దీన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీరికి ప్రోత్సాహక అమ్మకాలు కూడా వస్తున్నాయి. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన డాక్టర్ పంజాబ్‌రావు దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ వారు 200 లీటర్లు ఆర్డర్లు ఇచ్చారు. ‘నవజీవన్ ఉత్పాదక సంఘం’ అనే పేరుతో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.


ఈ విషయమై గడ్చిరోలి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయెల్ మాట్లాడుతూ ‘‘లొంగిపోయిన మహిళా నక్సల్స్ ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌గా ఏర్పడి వ్యాపారం చేసుకుంటున్నారు. వాద్రాలోని ఎంజీఐఆర్‌ఐలో వారికి ట్రైనింగ్ ఇచ్చాం. ‘క్లీన్ 101’ అనే తొలి ఉత్పత్తితో వారు వ్యాపారంలో అడుగుపెట్టారు. ఇది ఫ్లోర్ క్లీనింగ్ పినాయిల్. వారి వ్యాపారం పెరిగేంత వరకు అమ్మకాల్లో కొంత సాయం చేయాలని అనుకుంటున్నాం. విక్రయాల్లో కొంత ప్రోత్సాహం అందిస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2021-11-23T01:19:04+05:30 IST