Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేల్ మృతి

వాషింగ్టన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేల్(93) సోమవారం రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని అమెరికా వార్త సంస్థలు స్పష్టం చేశాయి. జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1977-81 మధ్య కాలంలో వాల్టర్ మొండేల్ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. మిన్నెసోట రాష్ట్రానికి చెందిన ఈయన 1960-64 మధ్య కాలంలో సొంత రాష్ట్రంలో అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత మిన్నెసోట నుంచే సెనేట్‌కు ఎన్నికయ్యారు. వాల్టర్ మొండేల్ మృతిపట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పందించారు. మంచి స్నేహితుడ్ని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాల్టర్ మొండేల్.. అమెరికా ఉత్తమ ఉపాధ్యక్షులలో ఒకరంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వాల్టర్ మొండేల్ మృతిగత కారణాలను ఆయన కుటుంబం వెల్లడించలేదు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement