హైదరాబాద్: తెలంగాణలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka chowdary) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో పసిపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై రేప్ జరిగిందని... హైదరాబాద్‌లో షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్(Raghunandan)పై కేసు నమోదు చేయడం సరైందే అని తెలిపారు. బాధితురాలి వివరాలు బయటపెట్టడమంటే నేరం చేయడమే అని అన్నారు. ఘటన తర్వాత ఐదారు రోజుల పాటు ఇన్నోవా కారు దొరకలేదని... ఇన్నోవా కారులో దొరికిన ఆధారాలు నిజమైనవేనా అని నిలదీశారు. హోంమంత్రి పదవి నుంచి మహమూద్ అలీ తప్పుకోవాలని రేణుకాచౌదరి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి