కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

ABN , First Publish Date - 2021-06-24T00:24:38+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ వేటు వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్‌ సమర్పించలేదు. దీంతో బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. బలరాం నాయక్‌పై వేటు వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 


గతంలో కాంగ్రెస్ తరపున 2009లో ఎంపీగా బలరాం నాయక్‌ ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్‌లో ఆయన మంత్రిగా పని చేశారు. 

Updated Date - 2021-06-24T00:24:38+05:30 IST