ఆ నేతల పేర్లు బయటపెట్టాలి

ABN , First Publish Date - 2021-03-02T08:42:33+05:30 IST

అవినీతిని సహించబోమని ప్రగల్భా లు పలికే ప్రధాని మోదీకి తన పార్టీ నేతలు చీకటి డీల్‌ ద్వారా రూ.30 కోట్లు వెనకేసుకున్న వైనం కనిపించడం లేదా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌

ఆ నేతల పేర్లు బయటపెట్టాలి

లేదంటే నేనే చెప్పాల్సి వస్తుంది: చింతా మోహన్‌ 


తిరుపతి, మార్చి 1: అవినీతిని సహించబోమని ప్రగల్భా లు పలికే ప్రధాని మోదీకి తన పార్టీ నేతలు చీకటి డీల్‌ ద్వారా రూ.30 కోట్లు వెనకేసుకున్న వైనం కనిపించడం లేదా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌ ప్రశ్నించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన చీకటి డీల్‌ కథనంపై ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లాలోని కల్కి భగవాన్‌ ట్రస్టుపై ఆదాయపన్ను శాఖ అధికారులతో దాడులు చేయించి.. ఆ కేసు నుంచి తప్పించేందుకు రూ.30 కోట్లు తీసుకున్న బీజేపీ నాయకుల పేర్లు బయటపెట్టి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పేర్లు బయటపెట్టకపోతే త్వరలో తానే చెప్పాల్సి వస్తుందన్నారు. కేబినెట్‌ మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ప్రధానిని ఇప్పటివరకు తాను చూడలేదన్నారు. బీజేపీ ప్రభుత్వానికి నీతి, నిబద్ధత ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, రైల్వే, బ్యాంకింగ్‌ రంగాలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చెప్పాలన్నారు. టీటీడీపై ఆర్‌ఎ్‌సఎస్‌ కుట్ర, గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరల పెంపు, ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, భెల్‌, దుగరాజపట్నం పోర్టు పనులు ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-03-02T08:42:33+05:30 IST