అవినీతి కేసులు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-03T22:14:03+05:30 IST

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మన్ ఏవీ వెంకటాచలం గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబర్‌లో క్రితం ఆయన నివాసంలో టీఎన్‌పీసీబీ కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్..

అవినీతి కేసులు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఆత్మహత్య

చెన్నై: అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మన్ ఏవీ వెంకటాచలం గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబర్‌లో క్రితం ఆయన నివాసంలో టీఎన్‌పీసీబీ కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 13.5 లక్షల రూపాయల నగదుతో పాటు, 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల చందనపు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీవీఏసీ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు జరిగిన రెండు నెలల అనంతరం వెంకటాచలం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మృతుడి వద్ద సూసైడ్ నోట్ లాంటిదేమీ దొరకలేదని తమిళనాడు పోలీసులు తెలిపారు.


సేలం చెన్నైలలోని వెంకటాచలం నివాసాలతో పాటు టీఎన్‌పీసీబీ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. డీవీఏసీ తనిఖీ అనంతరం వెంకటాచలంపై అవినీతి నిరోధక చట్టం, 1988 ప్రకారం.. నేరపూరితంగా దురుసు ప్రవర్తన, నేరపూరిత దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. కాగా, 2014లో కూడా వెంకటాచలంపై ఈ కేసులు నమోదు అయ్యాయి. ఏఐడీఎంకే ప్రభుత్వ హయాంలో వెంకటాచలం అవినీతికి పాల్పడ్డట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2021-12-03T22:14:03+05:30 IST