అర్జున అవార్డీ చంద్రశేఖర్‌ కరోనాతో కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-13T05:50:55+05:30 IST

కరోనాతో భారత టేబుల్‌ టెన్నిస్‌ మాజీ ఆటగాడు, అర్జున అవార్డీ వి.చంద్రశేఖర్‌ (64) బుధవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు...

అర్జున అవార్డీ చంద్రశేఖర్‌ కరోనాతో కన్నుమూత

చెన్నై: కరోనాతో భారత టేబుల్‌ టెన్నిస్‌ మాజీ ఆటగాడు, అర్జున అవార్డీ వి.చంద్రశేఖర్‌ (64) బుధవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్‌ మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. 1982 కామన్వెల్త్‌ గేమ్స్‌లో సెమీ్‌సకు చేరాడు. అయితే 1984లో మోకాలికి శస్త్ర చికిత్స తర్వాత కోచ్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అనతికాలంలోనే ఆయన మంచి కోచ్‌గా పేరు తెచ్చుకున్నాడు. భారత టీటీ స్టార్లు జి.సాతియన్‌, ఎస్‌.రమణ్‌, ఎమ్‌.ఎ్‌స.మైథిలీ తదితరులు ఆయన శిష్యులే. కాగా, కొవిడ్‌తో హాకీ మాజీ అంపైర్‌, టెక్నికల్‌ అధికారి రవీందర్‌ సోధీ (66) బుధవారం కన్నుమూశాడు. ఆయన మృతిపట్ల హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు జ్ఞానేంద్ర నింగోంబం సంతాపం తెలిపాడు. 


ఆర్‌పీ సింగ్‌ తండ్రి మృతి 

టీమిండియా మాజీ పేస్‌ బౌలర్‌ ఆర్‌పీ సింగ్‌ ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా బారిన పడిన ఆర్‌పీ సింగ్‌ తండ్రి శివ్‌ ప్రసాద్‌ సింగ్‌ బుధవారం కన్నుమూశాడు. 2007లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టులో ఆర్‌పీ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. 


Updated Date - 2021-05-13T05:50:55+05:30 IST