Abn logo
Nov 23 2021 @ 12:31PM

భారీ వర్షంతో పంటనష్టం.. రైతు ఆత్మహత్య

రాయచూరు(బెంగళూరు): వారం రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పంట నష్టం జరగడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయచూరు జిల్లాలోని లింగసుగూరు తాలూకా భోగాపూర గ్రామానికి చెందిన వీరశేఖర్‌ గౌడ(50) సోమవారం పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 8 ఎకరాల పొలం ఉన్న శేఖరగౌడ అందులో వరి ధాన్యంతో పాటు కందులు సాగు చేశాడు. ఇటీవల కురుస్తున్న వర్షం వల్ల పంటపూర్తిగా నష్టపోవడంతో దిగులు చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ముదగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

క్రైమ్ మరిన్ని...