గుణవర్దనెకు ఊరట

ABN , First Publish Date - 2021-05-11T09:14:26+05:30 IST

శ్రీలంక మాజీ క్రికెటర్‌ అవిష్క గుణవర్దనెకు ఊరట లభించింది. అతడిపై నమోదైన అవినీతి నిరోధక కోడ్‌ ఉల్లంఘనను ఐసీసీ ట్రిబ్యునల్‌ కొట్టివేసింది.

గుణవర్దనెకు ఊరట

దుబాయ్‌: శ్రీలంక మాజీ క్రికెటర్‌ అవిష్క గుణవర్దనెకు ఊరట లభించింది. అతడిపై నమోదైన అవినీతి నిరోధక కోడ్‌ ఉల్లంఘనను ఐసీసీ ట్రిబ్యునల్‌ కొట్టివేసింది. తక్షణం అతడు క్రికెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. కాగా, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాడంటూ మరో లంక మాజీ ఆటగాడు జొయ్సాపై వచ్చిన ఆరోపణలను కూడా ట్రిబ్యునల్‌ కొట్టేసింది. 

Updated Date - 2021-05-11T09:14:26+05:30 IST