తమిళనాడు మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తిరువెంగళాచార్యులు మృతి

ABN , First Publish Date - 2022-01-19T05:39:31+05:30 IST

తమిళనాడు మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జక్కల తిరువెంగళాచార్యులు (77) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె దళితవాడకు చెందిన తిరువెంగళాచార్యులు 1945లో జన్మించారు.

తమిళనాడు మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తిరువెంగళాచార్యులు మృతి

నందలూరు, జనవరి 18: తమిళనాడు మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జక్కల తిరువెంగళాచార్యులు (77) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె దళితవాడకు చెందిన తిరువెంగళాచార్యులు 1945లో జన్మించారు. ఆయన నందలూరు జిల్లా పరిషత హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆపై ఉన్నత చదువులు చదివి ఐఏఎ్‌సగా ఎంపికయ్యారు. అనంతరం పలు పదవుల్లో కొనసాగిన ఆయన తమిళనాడు రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయనకు భార్య స్వర్ణలత, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల వరదల్లో నష్టపోయిన రాజంపేట వరద బాధిత గ్రామాల్లో పర్యటించి లక్ష రూపాయల మేర బట్టలు, వస్తువులను అందజేశారు. తిరువెంగళాచార్యులు అంత్యక్రియలు చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం నిర్వహించనున్నారు. ఆయన మృతితో నాగిరెడ్డిపల్లె గ్రామంతో పాటు మండలంలోని ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.  

Updated Date - 2022-01-19T05:39:31+05:30 IST