అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఒబామా!

ABN , First Publish Date - 2021-11-21T23:16:02+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు శనివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఒబామా!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు శనివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా సోదరుడు, స్నేహితుడు అయిన అధ్యక్షుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్లుకు డెమాక్రెట్లు, రిపబ్లికన్ల మద్దతు లభించడం బైడెన్ ప్రభుత్వం విజయమని కూడా ఒబామా తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.  ‘‘దేశానికి గొప్ప మౌలిక వసతులను బహుమతిగా ఇస్తున్న మీకు ధన్యవాదాలు. అమెరికాను పునర్నిమిస్తున్న మీకు అందరూ రుణపడి ఉంటారు’’ అంటూ ఒబామా ట్వీట్ చేశారు. 


కాగా.. ఇటీవలే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్లుకు చట్టసభల ఆమోదం సంపాదించిన బైడెన్..  ప్రస్తుతం తన దృష్టిని బిల్డ్ బ్యాక్ బెటర్ అనే కొత్త ముసాయిదా చట్టంపై  కేంద్రీకరించారు. అయితే.. దీనికి రిపబ్లికన్ల మద్దతు ఉండకపోవచ్చని అమెరికా మీడియా అభిప్రాయపడుతోంది. ఈ బిల్లు కారణంగా అమెరికా విత్త లోటు వచ్చే పదేళ్లలో మరింతగా పెరిగి.. 367 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చట్టసభల బడ్జెట్ కార్యాలయం ఇటీవల అంచనా వేసింది. 



Updated Date - 2021-11-21T23:16:02+05:30 IST