ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన మాజీ ప్రధాని మన్మోహన్

ABN , First Publish Date - 2021-11-01T02:34:34+05:30 IST

అనారోగ్యంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (86) ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయన అనారోగ్య కారణాలతో అక్టోబర్ 13న ఎయిమ్స్‌లో..

ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన మాజీ ప్రధాని మన్మోహన్

న్యూఢిల్లీ: అనారోగ్యంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (86) ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయన అనారోగ్య కారణాలతో అక్టోబర్ 13న ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. కార్డియో-న్యూరో సెంటర్‌లో చేరిన మన్మోహన్‌కు డాక్టర్ నితిష్ నాయక్ చికిత్స అందించారు. కాగా, మన్మోహన్ సింగ్‌ను కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాందవీయ వెళ్లి పరామర్శించారు.


మన్మోహన్ ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని చికిత్స సమయంలో వైద్యులు తెలిపారు. మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.

Updated Date - 2021-11-01T02:34:34+05:30 IST