2012-13 భారత్ - పాక్ టూర్‌పై పీసీబీ మాజీ చైర్మన్ ఆసక్తికర కామెంట్స్

ABN , First Publish Date - 2022-04-15T22:14:41+05:30 IST

న్యూఢిల్లీ : సరిగ్గా పదేళ్ల క్రితం భారత్‌- పాక్ 2012-13లో ద్వైపాక్షిక సీరిస్‌ ఆడాయి. భారత్‌లో పాక్ పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశాన్ని నాటి పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ తాజాగా బయటపెట్టారు.

2012-13 భారత్ - పాక్ టూర్‌పై పీసీబీ మాజీ చైర్మన్ ఆసక్తికర కామెంట్స్

న్యూఢిల్లీ : సరిగ్గా పదేళ్ల క్రితం భారత్‌- పాక్ 2012-13లో ద్వైపాక్షిక సీరిస్‌ ఆడాయి. భారత్‌లో పాక్ పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన  అంశాన్ని నాటి పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ తాజాగా బయటపెట్టారు. క్రికెటర్లను కనిపెట్టేందుకు వారి వెంట భార్యలను కూడా భారత్‌కు పంపించామని ఆయన వెల్లడించారు. పాక్ ఆటగాళ్లు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ముందస్తుగా ఈ చర్య తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. పాక్ ఆటగాళ్లను ట్రాప్‌లోకి దించేందుకు భారత్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటుందని, పాకిస్తాన్‌తోపాటు ఆటగాళ్లకు కూడా కళంకం తెచ్చేందుకు యత్నిస్తుందని ఆష్రఫ్ ఆరోపించాడు. అందుకే తాను పీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు పాక్ జట్టు భారత్‌లో పర్యటిస్తే క్రికెటర్ల భార్యలను కూడా వెంట పంపించాలని చెప్పానని వివరించారు. ఆటగాళ్లు కొంత వ్యతిరేకించారు. కానీ ఆటగాళ్లపై భార్యలు ఓ కన్నేసి ఉంచుతారని చెప్పడంతో అందరూ సానుకూలంగా తీసుకున్నారు. భారత పర్యటనకు వెళ్లారని, ఆటగాళ్లందరూ క్రమశిక్షణతో నడుచుకున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు క్రికెట్ పాకిస్తాన్‌తో ఆయన మాట్లాడారు. 


కాగా 2012లో భారత్‌ ఆతిథ్యమివ్వడగా ఇరు జట్లు 3 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. 2-1 తేడాతో పాకిస్తాన్ వన్డే సిరీస్ గెలుపొందగా.. టీ20 సిరీస్ సమమైంది. కాగా పాక్‌లో భారత్ చివరిసారిగా 2005-06లో పర్యటించింది. ఈ పర్యటనలో 1-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలుచుకోవడంతోపాటు 4-1 తో వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకుంది.

Updated Date - 2022-04-15T22:14:41+05:30 IST