ఆ ఇద్దరు లేకపోవడంతో..ఆసీస్ లో భారత్‌ గెలిచింది

ABN , First Publish Date - 2020-04-07T10:03:34+05:30 IST

విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు 2018-19 ఆసీస్‌ టూర్‌లో తొలిసారిగా టెస్టు సిరీ్‌సను గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయం డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ ...

ఆ ఇద్దరు లేకపోవడంతో..ఆసీస్ లో భారత్‌ గెలిచింది

కరాచీ: విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు 2018-19 ఆసీస్‌ టూర్‌లో తొలిసారిగా టెస్టు సిరీ్‌సను గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయం డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ లేకపోవడంతోనే సాధ్యమైందని పాక్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యూనిస్‌ తేల్చాడు. ఆ సమయంలో బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా వార్నర్‌, స్మిత్‌ ఏడాది పాటు నిషేధంలో ఉన్నారు. 1995 నుంచి పాక్‌ జట్టు ఆసీ్‌సలో ఒక్క టెస్టు కూడా గెలవకపోవడంపై మాట్లాడుతూ యూనిస్‌.. భారత్‌ విజయంపై స్పందించాడు. ‘భారత జట్టు ప్రదర్శనను నేనేమీ తక్కువ చేయడం లేదు. ఆ టూర్‌లో కోహ్లీ సేన అద్భుతంగా ఆడింది. జట్టులో అందరూ సమర్థులే. కానీ అదే సమయంలో ఆసీస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మ్యాచ్‌ను శాసించే వార్నర్‌, స్మిత్‌ సేవలను వారు కోల్పోయారు. ఏ జట్టయినా అక్కడ పర్యటించి గెలవడం మామూ లు విషయం కాదు. ఇటీవల కివీస్‌ కూడా మట్టికరవగా యాషె్‌సలో ఇంగ్లండ్‌ను ఏకపక్షంగా ఓడించారు’ అని వకార్‌ గుర్తుచేశాడు. 


Updated Date - 2020-04-07T10:03:34+05:30 IST