పాక్ మాజీ ప్రధాని కుమారులపై కేసు

ABN , First Publish Date - 2020-12-02T20:58:45+05:30 IST

పాకిస్థాన్ దేశంలోని ముల్తాన్ ర్యాలీలో కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించారని మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ముగ్గురు కుమారులపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది....

పాక్ మాజీ ప్రధాని కుమారులపై కేసు

ముల్తాన్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలోని ముల్తాన్ ర్యాలీలో కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించారని మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ముగ్గురు కుమారులపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. నవంబరు 30వతేదీన 11 పార్టీల కూటమి అయిన పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ నిర్వహకులపై పాక్ సర్కారు కేసులు నమోదు చేసింది. యూసఫ్ రజా గిలా ముగ్గురు కుమారులు అలీమూసాగిలానీ, అబ్దుల్ ఖాదిర్ గిలానీ, అలీ హైదర్ గిలానీలతోపాటు అబ్దుల్ రెహమాన్ కంజో, బిలాల్ బట్, జమియాట్ ఉలేమా ఇ ఇస్లాం కు చెందిన అయాజ్ ఉల్ హక్ కస్మితో సహా మరో 48 మంది నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి.ముల్తాన్ ర్యాలీలో బాణసంచా కాల్చడం వల్ల గిడ్డంగిలో మంటలు చెలరేగాయని కార్డు బోర్డు గిడ్డంగి యజమాని ఫిర్యాదు చేయడంతో దీనిపై పాకిస్థాన్ మాజీ ముస్లింలీగ్ షాహిద్ పై కేసు నమెదు చేశారు. 


పాకిస్థాన్ పీపుల్సు పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ముల్తాన్ నగరంలో ర్యాలీకి నాయకత్వం వహించారు. ముల్తాన్ లో నవాన్ షెహర్ నుంచి ఘంటా చౌక్ వరకు జరిగిన ర్యాలీలో గిలానీ కుమారుడు సయ్యద్ అలీ మూసా గిలానీ ఎఫ్‌ఐఆర్ కాపీని చింపారు. వేదిక తాళాలు పగులగొట్టినందుకు జిల్లా యంత్రాంగం తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని మూసాగిలానీ చెప్పారు. యూసఫ్ గిలానీ మరో కుమారుడు ఖాసిమ్ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. మూసా ఖాసింలతో సహా మాజీ ప్రధాని ముగ్గురు కుమారులు లోహారి గేటు పోలీసుస్టేషనుకు చేరుకున్నారు. 

Updated Date - 2020-12-02T20:58:45+05:30 IST