కష్టం వానపాలు

ABN , First Publish Date - 2022-10-03T05:34:06+05:30 IST

అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట వానపాలైంది.

కష్టం వానపాలు

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 2: అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట వానపాలైంది. మండలంలోని కుణుతూరు గ్రామానికి చెందిన రైతు అశ్వత్థగారి వెంకటరెడ్డి బోరుబావి కింద 3 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి ఆశాజనకంగా రావడంతో రైతు ఆనందపడ్డాడు. పంట కాలం పూర్తవడంతో రెండ్రోజుల క్రితం తొలగించాడు. ఆ రోజు రాత్రి నుంచే వర్షం కురుస్తుండడంతో పంటంతా తోటలోనే తడిసి, కుళ్లిపోయింది. వేరుశనగ కాయలే కాదు, పశుగ్రాసం కూడా పనికిరాకుండా పోయింది. దీంతో పూర్తిగా నష్టపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Updated Date - 2022-10-03T05:34:06+05:30 IST