కాల్పుల కేసులో మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌కు జీవితఖైదు

ABN , First Publish Date - 2022-01-25T05:17:49+05:30 IST

కాల్పుల కేసులో నిందితుడు, ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫారూఖ్‌ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సాక్ష్యా ధారాలు పరిశీలించిన ప్రత్యేక కోర్టు ఫారూఖ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2020 డిసెంబరు 18న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో చిన్న పిల్లల క్రికెట్‌ ఆటతో మొదలైన గొడవ.. చివరకు కాల్పుల ఘటనకు దారి తీసింది. అదే కాలనీకి చెందిన మాజీ కౌ న్సిలర్‌ సయ్యద్‌ జమీర్‌, ఆయన కుమారుడు మన్నన్‌పై ఫారూఖ్‌ అహ్మద్‌ తల్వార్‌, రివాల్వర్‌ తో దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి.

కాల్పుల కేసులో మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌కు జీవితఖైదు
ఫారూఖ్‌ అహ్మద్‌ను జైలుకు తరలిస్తున్న పోలీసులు

రూ.12వేల జరిమానా 

ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు తీర్పు 

ఊహించిందే జరిగిందన్న నిందితుడు ఫారూఖ్‌ అహ్మద్‌

ఆదిలాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : కాల్పుల కేసులో నిందితుడు, ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫారూఖ్‌ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సాక్ష్యా ధారాలు పరిశీలించిన ప్రత్యేక కోర్టు ఫారూఖ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2020 డిసెంబరు 18న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో చిన్న పిల్లల క్రికెట్‌ ఆటతో మొదలైన గొడవ.. చివరకు కాల్పుల ఘటనకు దారి తీసింది. అదే కాలనీకి చెందిన మాజీ కౌ న్సిలర్‌ సయ్యద్‌ జమీర్‌, ఆయన కుమారుడు మన్నన్‌పై ఫారూఖ్‌ అహ్మద్‌ తల్వార్‌, రివాల్వర్‌ తో దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. అ ప్పట్లో జిల్లా ఎస్పీగా పని చేసిన విష్ణు ఎస్‌.వారియర్‌ ఆదేశాల మేరకు ఫారూఖ్‌అహ్మద్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మాజీ కౌన్సిల ర్‌ జమీర్‌ తీవ్ర గాయాలై.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 డిసెంబ రు 26న మృతి చెందాడు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఫారూఖ్‌ అహ్మద్‌ గతేడాది మార్చి 24 వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. ముందు గా 36మంది సాక్ష్యుల పేర్లు చార్జీషీటులో నమోదు చేయగా ఇందులో 24 మందిని మాత్రమే విచారించారు. కేసుకు సంబంధించిన వీడియో, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందు వల్ల నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 

ఇదిలా ఉండగా.. ఈ కేసులో తాను ఊహిం చిన విధంగానే శిక్ష పడిందంటూ నిందితుడు ఫారూఖ్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. దీని వెనుక స్థానిక అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-01-25T05:17:49+05:30 IST