72 వేల కోట్ల హెరాయిన్‌పై కేంద్రం విచారణ జరపాలి: Harsha kumar

ABN , First Publish Date - 2021-09-29T18:44:23+05:30 IST

ఆప్ఘనిస్థాన్ నుంచి నుంచి భారతదేశానికి దిగుమతి అయిన 72 వేల కోట్ల హెరాయిన్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

72 వేల కోట్ల హెరాయిన్‌పై కేంద్రం విచారణ జరపాలి: Harsha kumar

రాజమండ్రి: ఆప్ఘనిస్థాన్ నుంచి నుంచి భారతదేశానికి దిగుమతి అయిన 72 వేల కోట్ల హెరాయిన్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని  మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. హెరాయిన్ కాకినాడ, మచిలీపట్నం పోర్టుల నుంచి దిగుమతి అవుతోందన్నారు. డ్రగ్స్ మాపియాలో కాకినాడకు చెందిన ప్రజాప్రతినిది ఉన్నారని తెలిపారు. కాకినాడ పోర్టులో ఆయిల్ మాపియా, డ్రగ్స్ మాపియాల్లో కాకినాడ ప్రజాప్రతినిధి ఉన్నారని చెప్పారు. డ్రగ్స్ మాపియా యుద్ధం కన్నా, కరోనా కన్నా చాలా ప్రమాదమని ఆయన చెప్పుకొచ్చారు. ఎర్ర చందనం, గంజాయి అక్రమ రవాణాలో ఉన్న రాజకీయ పార్టీల నేతల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీజీపీ, వైసీపీ పార్టీలు ఒక్కటే అని వ్యాఖ్యానించారు. జగన్ అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతోందన్నారు. జగన్‌కు బెయిల్ రద్దు విషయంలో సీబీఐ నిందితుడుకే సహకరిస్తోందని ఆరోపించారు. డ్రగ్స్ మాపియాను పక్కదారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్, జగన్, బీజేపీలు డ్రామా ఆడుతున్నాయని... డ్రామాలో జనసైనికులు, మంత్రులు, పోసాని మురళీలు పావులే అని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-29T18:44:23+05:30 IST