రాజమండ్రి: రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలకు సజ్జల మాత్రమే మంత్రి అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఒక్క దళితుడికైనా రుణం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు పంపిణీ చేసే పెన్షన్లకు కూడా కులాన్ని ఆపాదించే దౌర్భాగ్య సీఎం జగన్ అని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు బయటకొస్తే ప్రజలు చితకబాదే సమయం ఆసన్నమైందని హర్షకుమార్ అన్నారు.