మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2022-07-03T05:15:54+05:30 IST

అగ్నిపథ్‌ స్కీం నోటిఫికేషన్‌ కు వ్యతిరేకంగా టీపీసీసీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారన్న సమాచారంతో శని వారం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంప త్‌ను శాంతినగర్‌లోని ఆయన నివాసంలో పోలీసు లు గృహ నిర్బంధం చేశారు.

మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను గృహంలో నిర్బంధించిన పోలీసులు

వడ్డేపల్లి, జూలై 2: అగ్నిపథ్‌ స్కీం నోటిఫికేషన్‌ కు వ్యతిరేకంగా టీపీసీసీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారన్న సమాచారంతో శని వారం  ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంప త్‌ను శాంతినగర్‌లోని ఆయన నివాసంలో పోలీసు లు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఇచ్చిన హామీ మరచి,  తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర మం త్రుల రాకను నిరసిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ఎ మ్మార్పీఎస్‌ తలపెట్టిన సడక్‌బంద్‌లో పాల్గొంటారనే కారణాలతో మాజీ ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కా ర్యాలయంలో గృహ నిర్బంధం చేశామని పోలీసులు తెలిపారు. 

 ఎమ్మార్పీఎస్‌ నాయకుల అరెస్టు 

కేటీదొడ్డి : మండలంలోని ఆయా గ్రామాల ఎమ్మార్పీఎస్‌ నాయకులను శనివారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తర లించారు. సడక్‌బంద్‌ పిలుపు, ప్రధాని రాకను అడ్డుకుంటారనే ఉద్ధేశంతో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు. అరెస్టయిన వారిలో ఆంజనేయులు, జంబయ్య, హన్మంతు ఉన్నారు.  

- అయిజ : మండలంలోని ఎమ్మార్పీఎస్‌ నా యకులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. స మితి జిల్లా నాయకుడు రాజు, ఆంజనేయులు, అడ్వకేట్‌ విజయ్‌కుమార్‌, సామేల్‌, నాగరాజు, ఏస న్న, నర్సింహులును పోలీసులు అరెస్టు చేసి సా యంత్రం స్వంత పూచీపై విడుదల చేశారు. 

- మల్దకల్‌ : సడక్‌బంద్‌ నేపథ్యంలో పోలీసు లు మండలంలోని ఎమ్మార్పీఎస్‌ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో స మితి జిల్లా నాయకుడు సుందర్‌రాజు, మండల అధ్యక్షుడు తిమ్మప్ప, ఎర్రన్న, యాకోబు, లక్ష్మన్న, ఎల్లప్ప, రత్నం, వినోద్‌, బుచ్చన్న కృష్ణ తదితరు లున్నారు.

 అక్రమ అరెస్ట్‌లు సరికావు 

గద్వాల క్రైం : జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు మూడురోజుల నుంచి ఎలాంటి కారణాలు లేకుండా, సమాచారం లేకుండా అర్ధరాత్రుల్లో ఇళ్ల కు వచ్చి అరెస్ట్‌లు చేయడం సరికాదని ఇఫ్ట్యూ జిల్లా అధ్యక్షుడు గంజిపేట రాజు అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకుంటారనే ఉద్ధేశంతో ఇలా అరెస్ట్‌లు చేస్తున్నామని పోలీసులు చెప్పడం ఏమిటని ఆయన మండిపడ్డారు. ముం దస్తు అరెస్ట్‌లు చేసి ఉద్యమాలను ఆపలేరన్నారు. అరెస్టయిన వారిలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వంశీకుమార్‌, సహాయ కార్యదర్శి మురళి, ఇప్ట్యూ జిల్లా నాయకుడు శివకుమార్‌తో పాటు, వివిధ సంఘాల నాయకులు ఇమ్మానియేల్‌, మాజీ ముని సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, రంజిత్‌కుమార్‌, మన్యం, నందు తదితరులున్నారు. 

Updated Date - 2022-07-03T05:15:54+05:30 IST