వచ్చే ఎన్నికల్లో ఈ టీడీపీ నేతకు MLA టికెట్ పక్కా.. మాటిచ్చేసిన Chandrababu..!

ABN , First Publish Date - 2021-12-16T18:20:41+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ఈ టీడీపీ నేతకు MLA టికెట్ ఖరారు.. మాటిచ్చేసిన Chandrababu..!

వచ్చే ఎన్నికల్లో ఈ టీడీపీ నేతకు MLA టికెట్ పక్కా.. మాటిచ్చేసిన Chandrababu..!

ఒక్క ZPTC ఎన్నిక.. ఆ నేతకు ఎమ్మెల్యే సీటు ఖాయం చేసి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సమరంలో వైసీపీ అనుకూలంగా ఫలితాలు వస్తే.. అందుకు భిన్నంగా అక్కడ  అధికార పార్టీ ఎమ్మెల్యే సొంతగడ్డపై స్థానిక ఉపఎన్నికలో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఆ నేతకు వచ్చే సాధారణ ఎన్నికలలో సీటు ఖాయమనే సంకేతాలు పార్టీ అధినేత ఇచ్చారట. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల చూపు ఆ నేత వైపు పడింది. ఇంతకు ఎవరా నాయకుడు? అసలు ఆయన అంతలా ఏం చేశారు? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


వచ్చే ఎన్నికల్లో వినుకొండలో టీడీపీ గెలుపునకు సంకేతాలు..
ముఖ్యంగా శావల్యాపురం మండలం.. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఇలాఖా కావడం మరో ప్రత్యేకత. ఎమ్మెల్యే సొంత మండలం, అందులోనూ ఆయన  స్వగ్రామానికి చెందిన మహిళనే బరిలోకి దింపిన జీవీ ఆంజనేయులు.. సవాల్ చేసి మరీ ఆమెను గెలిపించారు. ఇది వచ్చే ఎన్నికల్లో వినుకొండలో టీడీపీ గెలుపునకు సంకేతమన్న చర్చ  జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సొంత గ్రామమైన వేల్పూరుకు చెందిన పారా హైమావతిని పోటీలో నిలబెట్టి... ఆ గ్రామంలోనే ఎమ్మెల్యేను గట్టి  దెబ్బ కొట్టడంలో జీవీ  విజయం సాధించారని కూడా చర్చ జరుగుతోంది. ఇక కౌంటింగ్‌లో కూడా ఎలాంటి అవకతవకలు జరుగకుండా.. కోర్టును ఆశ్రయించి ప్రత్యేక ఎన్నికల అధికారితో లెక్కింపు సజావుగా  జరిపించగలిగారట. ఇలా ఎన్నికల్లో అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసి విజయం దక్కించుకున్న శావల్యాపురం వైపు టీడీపీ అధిష్టానం ఆసక్తిగా చూసింది.


పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా జీవీ ఆంజనేయులును అభినందించి పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక బలం ఉన్న ఆంజనేయులును నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయిస్తారన్న ప్రచారానికి కూడా అధినేత తెరతీశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుస్తారని చంద్రబాబు  ధీమా వ్యక్తం చేసి.. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అసలే జడ్పీటీసి  గెలుపు జోష్‌లో ఉన్న  జీవీ ఆంజనేయులుకు.. అధినేత  చంద్రబాబు మాటతో మరింత జోష్ వచ్చింది.


దూకుడు పెంచిన జీవీ ఆంజనేయులు
ఇక నియోజకవర్గంలో మరింత దూకుడు పెంచడంపై జీవీ ఆంజనేయులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ప్రతి కార్యకర్తకు నేనున్నాను  అని భరోసా ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక అయ్యేందుకు బాటలు వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వినుకొండ నియోజకవర్గంలో  ఆయన దూకుడు‌.. అధికార పార్టీ నేతలను బెంబేలెత్తిస్తోందట. మరి జీవీ ఆంజనేయులు ఈ ఊపును ఇలాగే కొనసాగిస్తారా.. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


కమ్యూనిస్టులకు కంచుకోట, రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ..
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట, రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ. ఇటీవల ఈ నియోజకవర్గంలోని శావల్యాపురం జడ్పీటీసీ  ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి విజయ ఢంకా మోగించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఈ ఎన్నికల్లో అంతా తానై అన్నట్లుగా వ్యవహరించారు. జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి పారా హైమావతిని గెలిపించగలిగారు. ఎన్నికల ప్రారంభం నుండి పోలింగ్, కౌంటింగ్ ముగిసేవరకు పార్టీ సైనికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. గెలుపును నల్లేరు మీద నడక వలె తీసుకువచ్చారు. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన తలొగ్గకుండా, పోలీసు బెదిరింపులకు బెదరకుండా, అక్రమ కేసులకు ఎదురొడ్డి పోలింగ్‌ బూతుల వద్ద  కార్యకర్తలు నిలబడి ఓటర్లను ఓటు వేయించగలిగారు. ఉపఎన్నికలో జెడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకోవడంతో వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశానికి పూర్వ వైభవం రావడం  ఖాయమన్న నమ్మకాన్ని పార్టీ కార్యకర్తల్లో తీసుకురాగలిగారు.

Updated Date - 2021-12-16T18:20:41+05:30 IST