TDP: తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధం... ఓపెన్ సవాల్ చేస్తున్నాం: తంగిరాల సౌమ్య

ABN , First Publish Date - 2022-07-19T18:11:56+05:30 IST

నందిగామలో టీడీపీ ఫ్లెక్సీలు చించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Tangirala sowmya) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

TDP: తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధం... ఓపెన్ సవాల్ చేస్తున్నాం: తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్: నందిగామలో టీడీపీ(TDP) ఫ్లెక్సీలు చించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Tangirala sowmya) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్లెక్సీలు చించిన విషయంలో వైసీపీ(YCP)పై సౌమ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని... ఓపెన్ సవాల్ చేస్తున్నామన్నారు. ‘‘మీకు జ్ఞానం లేదా ఇలాంటి చర్యలు చేసి మరింత దిగజారిపోతున్నారు. బ్యానర్లు చూసుకోవడానికి మీకు ఈ రెండు సంవత్సరాలే చివరి చూపు. మీరు చేసే చేష్టలకు అట్టు కాదు, బిర్యానీ పెడతాం. బ్యానర్లను చించివేయడం సిగ్గుమాలిన చర్య. అన్న క్యాంటీన్ కి వచ్చే ఆదరణ చూసి ఇలాంటి సిగ్గుమాలిన చర్య పాల్పడుతున్నారు. కెమెరా లేని చోట రెక్కీ నిర్వహించి ఈ విధంగా ఫ్లెక్సీని చించివేశారు’’ అంటూ సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-07-19T18:11:56+05:30 IST