మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు మృతి

ABN , First Publish Date - 2021-04-17T09:44:19+05:30 IST

సీపీఐ రాష్ట్ర నాయకుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కాకర్లపూడి సుబ్బరాజు (71) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు మృతి

విజయవాడ(అజిత్‌సింగ్‌ నగర్‌), ఏప్రిల్‌ 16: సీపీఐ రాష్ట్ర నాయకుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కాకర్లపూడి సుబ్బరాజు (71) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుబ్బరాజు విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని స్టూడెంట్‌ లీడర్‌గా కొనసాగారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఒకసారి సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌గా, రెండు పర్యాయాలు డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1994లో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత సోవియట్‌ సాంస్కృతిక సంఘం (ఇస్క్‌స)కు జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ప్రజాప్రతినిధులకు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ వేదిక ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరంను స్థాపించారు.  సుబ్బరాజు మరణవార్త తెలిసిన వెంటనే  పార్టీలకతీతంగా పలువురు నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి  నివాళులర్పించారు.  

Updated Date - 2021-04-17T09:44:19+05:30 IST