కరోనా కంటే పెద్ద వైరస్‌ ‘కల్వకుంట్ల’

ABN , First Publish Date - 2020-10-31T06:50:58+05:30 IST

‘‘కరోనా వచ్చినపుడు మాస్కులు పెట్టుకుని జాగ్రత్తపడ్డాం. కరోనా కంటే పెద్దవైరస్‌ కల్వకుంట్ల వైరస్‌. ఈ వైరస్‌ వల్ల అందరి ప్రాణాలూ పోతాయి. కాబట్టి కరోనాను తరిమినట్లు కల్వకుంట్ల వైర్‌సను కూడా తరిమేయాలంటే దుబ్బాకలో

కరోనా కంటే పెద్ద వైరస్‌ ‘కల్వకుంట్ల’

టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం

దుబ్బాకలో టీఆర్‌ఎ్‌సను ఓడించి బుద్ధి చెప్పాలి 

మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


చేగుంట, అక్టోబరు 30: ‘‘కరోనా వచ్చినపుడు మాస్కులు పెట్టుకుని జాగ్రత్తపడ్డాం. కరోనా కంటే పెద్దవైరస్‌ కల్వకుంట్ల వైరస్‌. ఈ వైరస్‌ వల్ల అందరి ప్రాణాలూ పోతాయి. కాబట్టి కరోనాను తరిమినట్లు కల్వకుంట్ల వైర్‌సను కూడా తరిమేయాలంటే దుబ్బాకలో టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలి’’. అని టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం అన్నారు.


చేగుంట మండలంలో, పొలంపల్లి, తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో కలిసి ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివా్‌సరెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నాగరిగారి ప్రీతం మాట్లాడారు. ఏడేళ్లపాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం, కేజీ టూ పీజీ ఉచిత విద్య వస్తది అనుకున్నాం. కానీ చివరికి బిచ్చగాళ్ల మాదిరి చేశారని మండిపడ్డారు. దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను శ్మశాన వాటికలు, రైతువేదిక, ప్రకృతి వనాలుకు భూసేకరణ మీద గుంజుకుంటూ పబ్బం గడుపుతున్నారని చెప్పారు. ఇతరుల భూములు లేవా? దళితులు భూములే దొరికాయా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బు ఇస్తే తీసుకుని కాంగ్రె్‌సకు ఓటు వేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాలంటే కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడారు.


ముత్యంరెడ్డి ప్రతిఒక్క ఊరిలో రోడ్లు, లైట్లు వేయించారని చెప్పారు.  దుబ్బాక ప్రజల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీయాలన్న ముత్యంరెడ్డి చివరి కోర్కే మేరకు అతని కొడుకు శ్రీనివాసరెడ్డి మనముందుకు వచ్చాడని తెలిపారు. అంతా వెలమ రాజ్యం అయిపోయిందన్నారు. బీజేపీ నుంచి కూడా వెలమ దొర వచ్చాడని  చంద్రశేఖర్‌ రావు, హరీశ్‌రావు, రఘునందన్‌రావు.. ఎవరికి ఓటేసినా మనకు ఏం ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ప్రజలకు న్యాయం చేసేవిధంగా అసెంబ్లీలో మాట్లాడి, పోరాడుతాడనితెలిపారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయబిల్లు ప్రవేశపెట్టిందని, ఇక మార్కెట్‌ కమిటీలను ప్రయివేటుపరం చేయబోతుందని చెప్పారు. అవి ప్రయివేటు వ్యక్తుల చేతులకు వెళ్లే మన భూముల్లో మనం కూలీలుగా పనిచేయాల్సిన దుస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందని చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రె్‌సను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఆగం, లక్ష్మి, నవీన్‌, అలీ పాల్గొన్నారు

Updated Date - 2020-10-31T06:50:58+05:30 IST