Abn logo
Sep 25 2021 @ 19:00PM

విలేకరి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ప.గో: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ద్వారకాతిరుమల ఆంధ్రజ్యోతి విలేకరి క్షత్రి లక్ష్మణ్ సింగ్ కుటుంబాన్ని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. టీడీపీ తరపున కుటుంబ సభ్యులకు రూ.50వేల నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంక సత్తిపండు పార్టీ నాయకులు మల్లిపెద్ది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption