మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడుకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-10-27T17:02:17+05:30 IST

దివంగత మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు ఏజెన్సీ వాసుల..

మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడుకు ఘన నివాళి

కొయ్యూరు(విశాఖపట్నం): దివంగత మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు ఏజెన్సీ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని సీపీఐ, వైసీపీ నేతలు కొనియాడారు. సోమవారం దేముడు ఐదవ వర్ధంతి సందర్భంగా వెలగలపాలెంలోని ఆయన ఘాట్‌ వద్ద విగ్రహానికి నర్సీపట్నం, పాడేరు, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు, విశాఖ, అనకాపల్లి ఎంపీలు, వైసీపీ, సీపీఐ నేతలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘నేనుసైతం చారిటబుల్‌ ట్రస్టు’ నిర్వాహకుడు, అరకు ఎంపీ మాధవి భర్త శివప్రసాద్‌ రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు అరకు ఎంపీ మాధవి దంపతులు సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో దేముడు భార్య చెల్లయ్యమ్మ, కుమారులు మహేష్‌, కుమార్‌, అరకు, పాడేరు, నర్సీపట్నం రంపచోడవరం ఎమ్మెల్యేలు శెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, ధనలక్ష్మి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తూర్పుగోదావరి జిల్లా సహకార బ్యాంకు చైర్‌పర్సన్‌ అనంతబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు, మహిళనేత పీలా వెంకటలక్ష్మి, చింతపల్లి మర్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హలియారాణి, వైసీపీ నేతలు జల్లి సుధాకర్‌, వారా నూకరాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, వైసీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


చింతపల్లిలో..

స్వర్గీయ మాజీ శాసనసభ్యుడు గొడ్టేటి దేముడు వర్ధంతిని సోమవారం చింతపల్లిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేముడు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు,  సీపీఐ జిల్లా సమితి సభ్యుడు సెగ్గె కొండలరావు, నాయకులు పట్ల పోతురాజు, కంకిపాటి సత్తిబాబు, రహమాన్‌, రమణ, చిన్నారావు పాల్గొన్నారు. 


పాడేరులో..

పాడేరురూరల్‌: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గొడ్డేటి దేముడు ఐదవ వర్ధంతిని స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. దేముడు చిత్రపటానికి కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.సీపీఐ మండల కార్యదర్శి కె.రాధాకృష్ణ, జీవన్‌, కుమార్‌, సింహాచలం, కనకరత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T17:02:17+05:30 IST