అవినీతి, దుబారా, అరాచకం వల్లే అప్పులు

ABN , First Publish Date - 2021-08-06T08:57:50+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దుబారా ఖర్చులు, అరాచకం, ఉన్న పరిశ్రమలను తరిమేయడంతోపాటు కొత్త వాటిని రప్పించడంలో వైఫల్యం

అవినీతి, దుబారా, అరాచకం వల్లే అప్పులు

మాజీ మంత్రి యనమల ధ్వజం 


అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దుబారా ఖర్చులు, అరాచకం, ఉన్న పరిశ్రమలను తరిమేయడంతోపాటు కొత్త వాటిని రప్పించడంలో వైఫల్యం కారణంగానే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. జగన్‌ ప్రభుత్వం చెబుతున్న విధంగా గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఏమాత్రం రాష్ట్రం అప్పుల పాలు కాలేదన్నారు. పైగా.. ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నట్లు.. బాబు ప్రభుత్వం కంటే సంక్షేమానికి, ప్రాజెక్టులకు జగన్‌ సర్కార్‌ ఎక్కువేమీ వెచ్చించలేదని వివరించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణలో ఉండే సీఎ్‌ఫఎంఎస్‌, బడ్జెట్‌ సెక్రటరీలది కాగా, దీనికి కొందరు ఉద్యోగులను బాధ్యులుగా పేర్కొం టూ, వారిని శిక్షించడం ఏమాత్రం తగదన్నారు. ఈ మేరకు గురువారం యనమల వివిధ అంశాలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జగన్‌ మంత్రివర్గం.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా, ఇష్టానుసారం వెచ్చిస్తోంది. టీడీపీ ప్రభుత్వంతో పోల్చితే సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నామని, ఇతర రంగాలకు నిధులిస్తున్నామని ప్రభుత్వం చాటుకోవడంలో ఏమాత్రం నిజం లేదు.


అయినప్పటికీ గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేయడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం తలెత్తిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం’’ అని వివరించారు. కాగా, ‘అమరరాజా’ కర్మాగారం ద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.1200 కోట్ల ఆదాయం వస్తుండగా, రాజకీయ కక్షతో దానిపై తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడుతూ, తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారనిదుయ్యబట్టారు. 

Updated Date - 2021-08-06T08:57:50+05:30 IST